వరుణ్ తేజ్ మట్కా ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్

varun tej matka movie interesting glimpse released

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తను ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితో అందులో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గానే వందేమాతరం అంటూ వచ్చే ఫస్ట సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఆపాట కూడా ఆకట్టుకుంది. ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మట్కా సినిమా షూటింగ్ దశలో ఉంది. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇదిలా ఉండగా నేడు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా మట్కా సినిమానుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఒక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషమున్నర నిడివి ఉన్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.వీడియోను బట్టి ఈసినిమా కూడా పీరియాడిక్ డ్రామాగా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక వీడియోలో వరుణ్ తేజ్ జేమ్స్ బాండ్ తరహా మేకోవర్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జీ.వీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మొత్తానికి గ్లింప్స్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =