కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ హిట్ దిశగా వెలుతుంది.ప్రపంచ వ్యాప్తంగా 5రోజుల్లో ఈసినిమా 35.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.నిన్న తెలుగు రాష్ట్రాల్లో 2.54కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో మొత్తం 5రోజుల్లో 18.17కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఆంధ్రా లో సూపర్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.వైజాగ్,గుంటూరు ,వెస్ట్ ,ఈస్ట్ ,సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.ఈ వారం కల్లా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక నా సామి రంగ ,నాగ్ కు కావాల్సిన విజయాన్ని అందించింది. విజయ్ బిన్ని డైరెక్షన్ లో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో యువ హీరోలు అల్లరి నరేష్,రాజ్ తరుణ్ లు కీలక పాత్రల్లో కనిపించగా నాగ్ సరసన ఆషికా రంగనాథ్ నటించింది.ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: