రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషలకు గాను ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.చాలా భారీ మొత్తానికి ఈ హక్కులను దక్కించుకుంది.ఇప్పటివరకు టాలీవుడ్ ఇదే అతి పెద్ద డీల్.ఇక ఈసినిమాను ఈరోజు అర్ధరాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లో ఉంచనున్నామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సలార్ థియేట్రికల్ రన్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 600కోట్లకు పైగాగ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ముఖ్యంగా నైజాం లో సూపర్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఈసినిమాతో చాలా కాలం తరువాత ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టాడు.
కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మలయాళం స్టార్ పృథీరాజ్ సుకుమారన్ ,జగపతి బాబు,శ్రీయా రెడ్డి ,బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు.రవి బస్రుర్ సంగీతం అందించగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.ఇక సలార్ సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం పేరుతో తెరకెక్కనుంది.ఈసినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































