సంక్రాంతికి నాగార్జున నుండి సినిమా రిలీజ్ అయిందంటే అది పక్కా హిట్ అన్నట్టు అయిపోయింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఇప్పుడు నా సామిరంగ సినిమా అన్నీ హిట్టే. విజయ్ బిన్ని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చింది నాా సామిరంగ. టైటిల్ కు తగ్గట్టే పర్ఫెక్ట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు రోజు రోజుకు పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు మేకర్స్ మరో నిర్ణయం తీసుకున్నారు. బీ, సీ సెంటర్లలో ఈసినిమా కోసం మరికొన్ని థియేటర్లను పెంచడం జరిగింది. మరి మరో వారం రోజుల వరకూ సినిమా రిలీజ్ లు లేవుకాబట్టి ఈసినిమాకు మరింత కలిసొచ్చే అంశం. అంతేకాదు కలెక్షన్స్ కూడా మంచిగా రాబట్టుకోవచ్చు.
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లన్ హీరోయిన్లుగా నటించగా షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మించారు ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: