టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపధ్యంలో.. నేడు చిత్ర యూనిట్ ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేసింది. ఈవెంట్‌లో హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఇంకా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ లాటి అనుభూతిని అందిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్‌ని ఇస్తుంది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా సపోర్ట్ చేశారు. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ గారికి ధన్యవాదాలు. సందీప్ కిషన్ అమెజింగ్ కోస్టార్. గ్రేట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గొప్పగా నిర్మించారు. శేఖర్ చంద్ర గారు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ‘నిజమే నే చెబుతున్నా’ పాటకు చాలా అద్భుతమైన రీచ్ వచ్చింది. ప్రేమికులందరికీ థాంక్స్ (నవ్వుతూ). ఫిబ్రవరి 9న ప్రీ వెలెంటైన్ ట్రీట్‌లా ఈ సినిమాని చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో ప్రేమకథ థ్రిల్ ఇస్తుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్స్‌లోనే చూడండి. ఇది గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీ” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: