సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం.సంక్రాంతి కి విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ మిక్సడ్ గా వచ్చినా మౌత్ టాక్ పాజిటివ్ టాక్ గా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 212 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రీజినల్ మూవీస్ లో అల్ టైం రికార్డు సృష్టించిందని నిర్మాతలు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ మొదటి వారం పూర్తైన సందర్భంగా తాజాగా మీడియా తో మాట్లాడారు.మొదటగా సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు దన్యవాదాలు తెలిపి కలెక్షన్స్ గురించి స్పందించారు.ఇప్పటివరకు బయ్యర్లు 90శాతం బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నారు అందుకు సంతోషం గా ఉందని అన్నారు ఇక అలాగే గుంటూరు కారం విషయంలో 1 ఏఎమ్ షోస్ వేసి తప్పు చేశామని అది తన ఒపీనియన్ గా చెప్పుకొచ్చారు.
సలార్ మాస్ సినిమా కాబట్టి ఆ టైం షోస్ ను ఎంజాయ్ చేసారు కానీ గుంటూరు కారం ఫ్యామిలీ ఎంటర్టైనర్ దాంతో వర్క్ అవుట్ కాలేదని అన్నారు.మొదటి రోజు కొంచెం కంగారు పడ్డ ఆతరువాత కలెక్షన్స్ చూసి దైర్యం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే త్వరలోనే సక్సెస్ పార్టీ ఏర్పాటు చేయనున్నామని కూడా తెలిపారు.వచ్చే వారంలో త్రివిక్రమ్ కూడా ఇంటర్వ్యూ లలో పాల్గొంటాడనని అన్నారు.ఇక గుంటూరు కారం ముఖ్యంగా ఆంధ్రా లో అదరగొడుతుంది.ఫ్యామిలీ ఆడియన్సు నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: