సస్పెన్స్ అంశాలతో హన్సిక 105 మినిట్స్ మూవీ ట్రైలర్

hansika motwani 105 minutes movie trailer out now

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చేస్తుంది. రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 105 మినిట్స్. ఈసినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సింగిల్ షాట్ లోనే ఈసినిమాను చిత్రీకరించారు. ఆమధ్య ఈసినిమాకు సంబంధించి పలు అప్ డేట్లు కూడా ఇచ్చేవారు. అయితే చాలా రోజుల నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయింది చిత్రయూనిట్. ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈసినిమా హన్సికకు మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందేమో చూద్దాం..

కాగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాను బొమ్మక శివ నిర్మాణంలో రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seventeen =