బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న గుంటూరు కారం.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?

Guntur Kaaram 1st Week Collections Mahesh Babu's Film Grosses Over Rs 212 Cr Worldwide

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ యేడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఫిమేల్ లీడ్ రోల్‌లో శ్రీలీల, మరో కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‍ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే రిలీజ్ రోజున అనూహ్యంగా వచ్చిన నెగటివ్ టాక్‍ను తట్టుకుని మరీ భారీ వసూళ్లు కొల్లగొడుతూ.. సూపర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది గుంటూరు కారం. సినిమా మొత్తం మహేశ్ వన్ మ్యాన్ షోగానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మహేశ్ ఎనర్జిటిక్ యాక్టింగ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, ఇంతకుముందెన్నడూ చేయని మాస్ డ్యాన్స్.. అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో కలెక్షన్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో గుంటూరు కారం మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ. 212 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మేరకు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

దీంతో తొలివారంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రీజినల్ ఫిల్మ్‌గా గుంటూరు కారం రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఇది మహేశ్‌కు 100 కోట్ల షేర్ అందుకున్న 5వ సినిమా కావడం గమనార్హం. ఇంతకుముందు ఆయన.. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ సినిమాలతో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇవన్నీ రీజినల్ మూవీస్ కావడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకుండానే మహేశ్‌ బాబు ఈ ఘనత సాధించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =