వరుణ్ కు బన్నీ క్యూట్ విషెస్

Allu Arjun Birthday Wishes To Cousin Varun Tej

నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా వరుణ్ కు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీస్ అందరూ పుట్టినరోజు అందిస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ ద్వారా వరుణ్ కు బర్త్ డే విషెస్ ను అందించారు. హ్యాపీ బర్త్ డే మై స్వీటెస్ట్ కజిన్ వరుణ్ అంటూ పోస్ట్ లో రాస్తూ.. తను, వరుణ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు బన్నీ. ఇక ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా, కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 16వ తేదీన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మట్కా సినిమా షూటింగ్ దశలో ఉంది. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో పుష్ప2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =