అయలాన్ ,కెప్టెన్ మిల్లర్ టాక్ 

ayalaan and captain miller movie reviews

ఈరోజు కోలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి అందులో ఒకటి అయలాన్ కాగా రెండోది కెప్టెన్ మిల్లర్.ఈరెండు తెలుగులోకూడా విడుదలకావాల్సి వుంది కానీ ఇక్కడ  పండగ బరిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉండడంతో థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి వాయిదావేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరెండు సినిమాల టాక్ చూస్తే అయలాన్….శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా.దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది.హీరోకి ఏలియన్  కితోడై ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది.ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.శివ కార్తికేయన్ యాక్టింగ్ కి తోడు ఏలియన్ ,హీరోకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయట.ముఖ్యంగా విఎఫ్ఎక్స్ స్టన్నింగ్ అని అంటున్నారు.ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా యోగిబాబు, కరుణాకర్ కీలక పాత్రలో నటించారు.ఆర్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను కెజెఆర్ స్టూడియోస్ నిర్మించింది. త్వరలోనే తెలుగు రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.తెలుగులో బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక కెప్టెన్ మిల్లర్ విషయానికి వస్తే ధనుష్ హీరోగా నటించిన ఈసినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈసినిమాలో ధనుష్ వన్ మ్యాన్ షో చేశాడట.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అయ్యాయట.అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.ఇక కెప్టెన్ మిల్లర్ తెలుగులో ఈనెల 25న విడుదలకానుంది.ఏషియన్ సినిమాస్ ,సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదలచేస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =