పెయిడ్ ప్రీమియర్లలో హనుమాన్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఈరోజు ఈసినిమా విడుదలకాగా నిన్న పెయిడ్ ప్రీమియర్లు వేశారు.దాదాపు 200కు పైగా షోస్ వేయగా అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో ప్రీమియర్ కలెక్షన్ల విషయంలో హనుమాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీమియర్స్ తోనే 6కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.అటు యుఎస్ఏలో కూడా 300k డాలర్ వసూళ్లను ప్రీమియర్స్ ద్వారా రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ఆల్ ఓవర్ యూనానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది.ఈసంక్రాంతికి చిన్న సినిమా గా వచ్చి హనుమాన్ సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.దాదాపు 25కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఈమూడు రోజుల్లో ఆటార్గెట్ ను చేరుకుంటుంది.ఫుల్ రన్ లో ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురావడం ఖాయం.కేవలం 25కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో విజువల్స్,బీజీఎమ్ ఎక్స్ట్రార్డినరీ అంటూ చూసిన వారు ప్రశంసలు కురిపిస్తన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈసినిమాతో స్టార్ లీగ్ లో చేరిపోనున్నాడు.ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా సముద్రఖని,వరలక్ష్మి శరత్ కుమార్,జబర్దస్త్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు.నిరంజన్ రెడ్డి నిర్మించాడు.ఇక హనుమాన్ కు సీక్వెల్ కూడా రానుంది. జై హనుమాన్ టైటిల్ తో తెరకెక్కనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: