గుంటూరు కారం స్పెషల్‌ షో.. సుదర్శన్ థియేటర్‌లో మహేశ్‌ బాబు సందడి

Mahesh Babu Watches Guntur Kaaram at Sudarshan 35MM

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మహేశ్‌ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ఈ సినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్స్, టీజర్, లిరికల్‌ సాంగ్స్‌.. అన్నీ మూవీ లవర్స్‌ని విశేషంగా అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ఈరోజు (జ‌న‌వ‌రి 12, 2024) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో గుంటూరు కారం థియేటర్ల వద్ద సూపర్ స్టార్ అభిమానులు డ్యాన్సులు, కేకలతో హోరెత్తిస్తున్నారు. అయితే మూవీ లవర్స్‌ అంతా ఇలా థియేటర్లలో ఎంజాయ్ చేస్తుండగా.. మరోవైపు హీరో మహేశ్‌ బాబు గుంటూరు కారం స్పెషల్ షోను వీక్షించేందుకు ఈరోజు హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా మహేశ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మరియు మరో దర్శకుడు వంశీ పైడిపల్లి తదితరులు విచ్చేశారు. దీంతో థియేటర్ దగ్గర అభిమానులు ఈలలు, అరుపులతో సందడి నెలకొంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత మహేశ్ త్వరలోనే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ క్రేజీఎస్ట్ ప్రాజెక్టులో నటించనున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 5 =