ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ లో మార్పు లేదు.. మేకర్స్ క్లారిటీ

makers clarity on ooru peru bhairavakona movie release date

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. దానికి కారణం అదే రోజున పలు సినిమాలు రావడం. సంక్రాంతి బరి నుండి తప్పుకున్న కొన్ని సినిమాలు ఫిబ్రవరి 9కి డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. వాటిలో ఈగల్, లాల్ సలామ్ సినిమాలు ఉన్నాయి. ఈకారణంతో ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ డేట్ ను మార్చనున్నారంటూ కథనాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని చెప్పేలా చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఈసినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ లో తెలిపింది.

ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + eighteen =