సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కేరింతల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కృతఙ్ఞతలు. ఎన్ని పుస్తకాలు చదివితేనో, ఎంతో అనుభవాలు ఉంటేనో గానీ అంత జ్ఞానం రాదు. మీరు అలా ఒక్క ముక్కలో, ఒక్క మాటలో, ఒక్క పాటలో అలా ధారపోస్తారు” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “రాఘవేంద్రరావు గారి సినిమా తర్వాత ఇది మళ్ళీ నాకు రీలాంచ్ లా అనిపిస్తుంది. నాకు అమ్ము పాత్ర ఇచ్చినందుకు, నన్ను గైడ్ చేసినందుకు, సెట్ లో నా టార్చర్ భరించినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. మహేష్ బాబు గారిని చూస్తూ ఒక్కోసారి నేను డైలాగ్స్ కూడా మర్చిపోయేదాన్ని. నా పట్ల అంత ఓపిక ఉన్నందుకు థాంక్యూ సార్. మహేష్ బాబు గారు ఎలా ఉంటారంటే.. ఒక బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆయనే కాదు, ఆయన మనసు కూడా అందమైనది. ఎక్కడో ప్రేక్షకుల మధ్యలో ఉండి చూడాల్సిన దానిని, దేవుడి దయ వల్ల ఇక్కడున్నాను అనుకుంటున్నాను. మీనాక్షి నాకు సోదరి లాంటిది. మా నిర్మాతలు కుటుంబసభ్యుల్లా అనిపిస్తారు. నా మొదటి అడుగు నుంచి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. మీకోసం గుంటూరు కారంతో వస్తున్నాను. ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ.. నేను మీ అమ్ము.. మీకోసం థియేటర్లలో ఎదురుచూస్తూ ఉంటాను” అని శ్రీలీల తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: