అశోక్ గల్లా 2 టైటిల్, టీజర్ రిలీజ్

ashok galla 2 movie title and teaser out now

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఈ యాక్షన్ వీడియో ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు చాలా రోజుల తరువాత క్రేజీ అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది. అశోక్ ఈసారి పవర్ ఫుల్ రోల్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమాలో తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలానే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి.

కాగా ఈసినిమాను జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్‌ వర్మ కథను అందిస్తున్నాడు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =