మాస్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న నా సామిరంగ ట్రైలర్

nagarjuna naa saami ranga movie trailer out now

కింగ్ నాగార్జున కూడా మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నా సామిరంగ అంటూ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఇక ఈసారి తనకు కలిసొచ్చే మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసినిమా నుండి వచ్చిన గ్లింప్స్ కానీ, టీజర్, పాటలు అన్నీ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో నాగార్జున మరోసారి తన మాస్ యాంగిల్ ను చూపించారు. కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సింది.

కాగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అషికా రంగనాథ్,రుక్సార్ థిల్లన్, మిర్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ తరుణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eighteen =