ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం వెనక్కి తగ్గాయి. ఇప్పటికే రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పొంగల్ బరి నుండి తప్పుకుంది. ఆసినిమా మరేదో కాదు లాల్ సలామ్. ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Namma THER THIRUVIZHA’ku Alappara kelappa neram vandhachu! #LALSALAAM hits the big screens on February 9th 2024! Save the date! 🗓️
@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @RedGiantMovies_… pic.twitter.com/rbBetXDlyP
— Red Giant Movies (@RedGiantMovies_) January 9, 2024
ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: