లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో కొన్నిసీన్లు శైలేష్ కొలను డైరెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా శైలేష్ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ ను గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక పార్ట్ కు మీరు వర్క్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అని అడుగగా దానికి శైలేష్ కొలను ఇందులో కప్పి పుచ్చుకోవాల్సింది ఏం లేదు.. ప్రతి సినిమాలో కొన్నిబీ రోల్ షాట్స్ కొన్ని ఉంటాయి.. అంటే ఎలాంటి పాత్రలు లేకుండా కొన్ని సీన్స్ ఉంటాయి.. అయితే అలాంటి సీన్లు కూడా శంకర్ గారు ఎవరికి చెప్పరంటా.. కానీ వాళ్లు ఏదో ఒక షెడ్యూల్ తో ప్యాక్ అయిపోయి ఉన్నారు..ఎక్కడికీ కదలలేని పరిస్థితిలో ఉన్నారంటా.. అప్పుడు ఎవరైనా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో ఆ షాట్స్ ను తీయమని అడిగారట. అప్పుడు రాజు గారు నాకు ఫోన్ చేసి అడిగారు..యాక్టర్స్ ఎవరూ ఉండరు.. అయితే నాకు కొన్ని వైడ్ యాంగిల్ షాాట్స్ కావాలని అడిగితే నేను ఒకటి రెండు రోజుల్లో ఆ షాట్స్ తీశాను. అంతే తప్పా నేను ఆసినిమాకు ఏదో సైలెంట్ గా షూట్ చేసేంత సీనే లేదు. రాజు గారు నాకు ఫ్యామిలీ లాగ తను అడిగారు.. అప్పుడు కూడా శంకర్ గారు ఓకే నా.. ఎందుకంటే ఆయన చాలా పర్టిక్యులర్ గా ఉంటారు అని విన్నాను అని అన్నా.. అదేంలేదు అన్నారు కాబట్టే ఆ ఫిల్లింగ్ షాట్స్ అయినా తీశా అని క్లారిటీ ఇచ్చారు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: