బేబీతో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య.అంతకు ముందు వెబ్ సిరీస్ ల్లో అలాగే కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేసింది.ఇక గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.ఏకంగా 70కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారీ లాభాలను తీసుకొచ్చింది.ఈసినిమాలో వైష్ణవి నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తరువాత వైష్ణవి కి చాలానే ఆఫర్లు వచ్చాయి.ప్రస్తుతానికి అయితే మూడు సినిమాలకు సైన్ చేసింది. అందులో రెండు సినిమాలు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లవి కాగా మరొకటి బేబీ మేకర్స్ నుండి.బేబీ లో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి జంటగాఎస్ కె ఎన్ అలాగే బేబీ సినిమాకు దర్శకుడు గా పనిచేసిన సాయి రాజేష్ నిర్మాతలు గా ఓ సినిమాను నిర్మిస్తున్నారు.రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.సమ్మర్ లో విడుదలకానుంది.
ఇక రీసెంట్ గా మరో రెండు క్రేజీ ఆఫర్లను అందుకుంది వైష్ణవి.అందులో దిల్ రాజు నిర్మాణం లో ఒకటి. ఈసినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.పిసి శ్రీరామ్ కెమెరామెన్.
ఈసినిమాతోపాటు వైష్ణవి ప్రామిసింగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సరసన నటించే ఛాన్స్ కొట్టింది.బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమా లో వైష్ణవి హీరోయిన్ గా నటించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























