సర్కారు నౌకరి- ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్

sarkaaru noukari movie release date fixed

సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు నౌకరి. 1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు పోస్టర్లను అలానే టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు మేకర్స్. ఇక ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను కొత్త ఎడాది సందర్భంగా 2024 జనవరి 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + fourteen =