బిగ్ బాస్ 7-ఓటు అప్పీల్ ఛాన్స్.. అర్జున్ వర్సెస్ అమర్

bigg boss season 7 telugu day 94 highlights

బిగ్ బాస్ సీజన్ 7 చూస్తుండగానే అయిపోవస్తుంది. మరో పదిరోజుల్లో ఈసీజన్ పూర్తవ్వనుంది. ప్రస్తుతం అయితే ఓటు అప్పీల్ కోసం హౌస్ లో పోటీ జరుగుతుంది. బుధవారం రెండు టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. పాట ప్లే చేస్తాడు… ఆ వెంటనే హౌస్ మేట్స్ బెంచ్ పై ఉన్న వస్తువుల్లో ఒకదాన్ని తీసుకొని పూల్ లో దూకాలి. ఈ టాస్క్ లో ఫైనల్ గా యావర్ గెలుస్తాడు. ఆతరవాత కలర్స్ జంపింగ్ గేమ్ ఇస్తాడు. ఈ గేమ్ లో మూడు కలర్స్ ఉంటాయి.. బిగ్ బాస్ ఏ కలర్ చెబితే వారు జంప్ చేసి ఆ కలర్ లో కాలు పెట్టాలి..ఈ టాస్క్ లో శోభా ఫైనల్ గా గెలుస్తుంది. ఆ తరువాత శోభా, యావర్ కు ఓటింగ్ పెట్టగా హౌస్ మేట్స్ శోభాకు ఛాన్స్ ఇస్తారు. దాంతో శోభా తనకు సపోర్ట్ చేయమని ఓటు అప్పీల్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అక్కడి నుండే గురువారం ఎపిసోడ్ మొదలవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగే ఒక రెండు కేజీల కేక్ ను పంపించి అర్జున్ ను తినమంటాడు బిగ్ బాస్. అలా తింటే హౌస్ మేట్స్ కు కేక్ తెప్పిస్తానని చెబుతాడు. దాంతో అర్జున్ కేకు తినడం మొదలుపెడతాడు. కొంత తినేసరికి ఇంకా తనవల్ల కావట్లేదని చెప్పడంతో వేరొకరి సహాయం తీసుకోమని చెబుతాడు. దానికి యావర్ ను తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఏదోలా కేకు మొత్తం కంప్లీట్ చేస్తారు. దానికిగాను బిగ్ బాస్ కేక్ పంపిస్తానంటాడు.

ఆతరువాత మరో ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. తనకు కవలు పిల్లలు ఉన్నారని.. నేను బయటకు వెళ్లి వచ్చేలోపు కాసేపు ఆడించాలని చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో ఎవరి తోచినట్టు వాళ్లు చేశారు. ఆ తరువాత చెర్రీ ఆన్ ద టాప్ అనే టాస్క్ ను ఇచ్చాడు. దీనికోసం ఇసుకతో చేసిన ఒక కేక్ ను దానిపై ఒక చెర్రీని పంపిస్తాడు. హౌస్ మేట్స్ దీన్ని స్లైసెస్ గా కట్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో అమర్ గెలుస్తాడు. అనంతరం మరో గేమ్ ఉంటుందని.. అయితే దీనికోసం ఎవరైతే మందుగా బెల్ కొడతారోవారే గెలుస్తారని తెలిపింది. ఈ టాస్క్ లో అర్జున్ గెలుస్తాడు. ఇక ఈ గేమ్ జరుగుతున్న నేపథ్యంలో అర్జున్, ప్రశాంత్ కు మధ్య గొడవ జరుగుతుంది. అర్జున్ పరిగెత్తుతున్న సమయంలో తన చేతులు ప్రశాంత్ కు తగిలాయని అనడంతో నిన్న పూల్ టాస్క్ లో నీ చేతులు తగిలాయని నేను అన్నానా అంటూ కౌంటర్ ఇచ్చాడు.

మరి నిన్న ఏపిసోడ్ అమర్, అర్జున్ టాస్క్ లు గెలిచి ఓటు అప్పీల్ చేసుకునే అర్హతను సొంతం చేసుకున్నారు. వీరిద్దరిలో ఎవరికి హౌస్ మేట్స్ ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తారో నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.