నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపధ్యంలో ‘హాయ్ నాన్న’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ‘హాయ్ నాన్న’ అని సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్ ని అభినందించిందని సమాచారం. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్ లో మ్యూజికల్ నైట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో హీరో నాని ‘కమ్మని ఈ ప్రేమలేఖనే” పాటను పాడి అభిమానులని అలరించారు. నాని, మృణాల్ ఠాకూర్ కలసి ‘హాయ్ నాన్న’ చిత్రంలోని ఓడియమ్మా పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియోలు వైరల్ గా మారి టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: