తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తను చేసే సినిమాల్లో వైవిధ్యత ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గానే జపాన్ అంటూ మరో డిఫరంట్ కథతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 10వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫెరంట్ మేకోవర్ తో, డిఫరెంట్ వాయితో అలరించాడు కార్తీ. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అయితే అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీ లోకి కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈసినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. దీనిలోభాగంగానే ఈసినిమాను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించారు. డిసెంబర్ 11వ తేదీన ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈసినిమా అందుబాటులోకి రానుంది.
ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించగా.. సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేశారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: