‘యానిమల్’పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ రివ్యూ

Ram Gopal Varma Sensational Review on Animal Movie

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘యానిమల్’ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ప్రముఖ నిర్మాత దిల్‍ రాజు తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం (డిసెంబర్ 1, 2023) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యానిమల్ సినిమాపై తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చారు. వర్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“యానిమల్ సినిమా మీద రాసిన చాలా రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమాకి వెళ్ళాను. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఏ సినిమానీ చూడలేను.. అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లో చూడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను. నైన్ అండ్ హాఫ్ వీక్స్, ఫ్యాటల్ అట్రాక్షన్, లోలిట, లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా, నచ్చలేదా, అన్నంత సింపుల్‌గా ఉండకూడదు. రియల్లీ ఇంపాక్ట్‌ఫుల్ సినిమా అనేది ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గ్వ్ చేసుకునేలా ఉండాలి. ఒక కొత్త తర్కానికి తెర తీయాలి అన్నాడు. అదే సందేశం ఇవ్వాళ సందీప్ వంగ, యానిమల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు”.

“బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ కూడా యానిమల్ సినిమాకి సంభందించిన వాదనలు, తర్కాలు కొనసాగుతాయి. అంతే కాకుండా, ఈ సినిమా హిపోక్రిసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపం చూపించడంతో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది అని నా ప్రఘాడ నమ్మకం. ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు.. అది ఒక సోషల్ స్టేట్‌మెంట్‌. నాకు ఆ సినిమా కథ కానీ, తండ్రి కొడుకుల బంధం కానీ ఏమంత ఎక్కలేదు. కానీ బాగా ఎక్కిందేంటంటే అలాంటి పాత కథా వస్తువుల్ని బేస్‌గా చేసుకుంటూ సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం”.

“సినిమా అంటే ఇలాగే వుండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు సందీప్. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేసాడు. యానిమల్ సినిమా స్లోగా ఉన్నప్పటికీ చాలా సార్లు మనం షాక్ అవుతాము.. దానికి కారణం సినిమా స్లోగా ఉండటమే అని తర్వాత తెలుసుకుంటాము.. నా ఉద్దేశ్యంలో ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే. హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాటో అలాంటిదేదో పట్టుకుని వస్తాడేమో అని నాతో పాటు అందరూ ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న టైంలో మెషీన్ గన్‌తో రావటం అన్నది థియేటర్‌లో మా అందరినీ కుర్చీలోనుంచి కింద పడేంత ఎఫెక్ట్ ఇచ్చింది”.

“హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్” అని రన్బీర్ సింపుల్ గా చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. “ఇక మీ మీద ఈగ వాలినా సరే వాళ్ళని తగలబెట్టేస్తాను” అనే మాట రణ్‌బీర్‌ తన తండ్రికి చెప్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ పరంగా, ఎడిటింగ్ శైలి పరంగా ఆ పాత్రను ఎలివేట్ చెయ్యటానికి తీసుకున్న ఎక్కువ టైం కేక్ మొత్తం తయారీ చూపించి ఐసింగ్ పెట్టినట్టనిపించింది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్‍లో వాడిన ‘అర్జున్ వెల్లి’ పాట, మైకేల్ జాక్సన్ “బీట్ ఇట్” మ్యూజిక్ వీడియోని గుర్తు చేసింది. ట్రెడిషనల్ సినిమా రోల్స్‌ని కడుపులో గుద్దుతూ, తన కాళ్లతో తన్నినందుకు సంప్‌ని జీర్ణించుకోలేక, కడుపు నొప్పితో నేల మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు. ఇక్కడ “ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్, ఆర్ట్ ఈజ్ అల్సో వాట్ ఇట్ కుడ్ బీ” అని ఐయాన్ రాండ్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి”.

“నిజాన్ని దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని ఏ మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్. దీనికి ఉదాహరణగా అక్కడక్కడా వచ్చే కామిక్ సన్నివేశాల్లో ఉదాహరణకి, బ్రా స్ట్రాప్ స్పాంకింగ్, సెక్స్ గురించి డాక్టర్ లతో మాట్లాడుతున్నప్పుడు లాంటివి చెప్పుకోవచ్చు. ఇలాంటివి సినిమాకు అవసరం లేదేమో అనిపించినా కేవలం హీరో పాత్ర స్వభావాన్ని ప్రేక్షకుల మెదళ్ళల్లోకి మేకులు కొట్టి దించడమే ఇక్కడ డైరెక్టర్ లక్ష్యం. తన భర్తని తమ్ముడు విజయే చంపాడు అని తెలిసిన తర్వాత విజయ్‌ని తన అక్క కొట్టడం, తరువాత విజయ్ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే సీను ఫ్రాన్సిస్ కాప్పొల గాడ్ ఫాదర్ సీన్‌కి బాబులా వుంది. ఒక్క మాటలొ చెప్పాలంటే ఫ్రాన్సిస్ కాప్పొల సందీప్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలి”.

“ఇందులో విలన్ బాబీ ఇంట్రడక్షన్ సినిమా చరిత్రలోనే అంతముందెప్పుడూ లేనంత అత్యంత ఒరిజినల్‌గా ఉంది.. ఎందుకంటే ఒక స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్‌లో అతన్ని ఒక పెళ్లి కూతురి మేని ముసుగు తీసినట్టు ఆవిష్కరించడం జస్ట్ జీనియస్. తను పూర్తి ఆరోగ్యవంతుణ్ణయిపోయాను అని చెప్పటానికి హీరో తన ఫామిలీ ముందు, స్టాఫ్ ముందు నగ్నంగా నడిచే సీన్ నెవెర్ బిఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్ సినిమా. విజయ్ పాత్రకి సంభందించి నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం, అమ్మాయిని విజయ్ తన బూట్లు నాకమని ఆర్డర్ ఇవ్వడం.. అది కూడా ఎందుకంటే ఆ నటిని ఎంచుకున్న తీరు, తనని చూస్తూనే నాకు కలిగిన సానుభూతి, తనని చూపించిన ప్రతి క్లోజ్ షాట్‌లో అది పెరుగుతూ రావడమే. ఇక కండోమ్ వాడావా? అని హీరోని రష్మిక అడిగే సీనూ, అది రాసిన, తీసిన తీరు అద్భుతం. రష్మీక నటనకి నేను క్లీన్ బౌల్డ్ అనే చెప్పాలి”.

“ట్రైలర్స్ చూసినప్పటి నుంచి రణ్‌బీర్‌ ఏమైనా కొంచెం ఓవర్‌గా వెళుతున్నాడా అన్న ఫీలింగ్ నాకు లోలోపల ఉండింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్‌గా, ప్రేక్షకుడిగా, మొదటిసారి రణ్‌బీర్‌ నటన సందీప్ రాసిన క్యారెక్టర్‌ని మోస్తందా? లేదా సందీప్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ రణ్‌బీర్‌ నటనని మోస్తాందా? అన్న కన్ఫ్యూజన్‌లో పడేసింది నన్ను. రణ్‌బీర్‌ నటనలో వున్న ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి ఇప్పుడు 2023 వరకూ, 110 సంవత్సరాలలో ఏ యాక్టరూ చూపించలేకపోయాడు. ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రణ్‌బీర్‌ లియోనార్డో డి కాప్రియోని కూడా మించిపోయాడు. హేయ్ సందీప్ వంగ దయచేసి నీ కాళ్ళ ఫోటో నాకు వాట్సాప్‌లో పంపిస్తే మొక్కుకుంటాను”.

దానికి కారణాలు..

1. కెమెరా కనుక్కున్న మొదలు ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటిని నీ ఎడమ కాలి బూటుతో తన్ని తన్ని రక్తాలు కక్కుకునేలా చేసావు.

2. ఇకనుంచి బాలీవుడ్‌లో కానీ, టాలీవుడ్‌లో కానీ, ప్రతి సినిమా ఆఫీస్‍లోనూ నీ యానిమల్ సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి వాళ్ళు ముందు ముందు తియ్యబోయే ప్రతి సినిమాని పీడిస్తుంది.

నేను ముందే చెప్పినట్టు, ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రణ్‌బీర్‌తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా, అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్‌కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్‌లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రణ్‌బీర్‌ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను” అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 2 =