బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు ‘మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్’, ‘త్రీ ఇడియట్స్’ ‘పీకే’, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘డంకీ’లో నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్ట్రెస్ తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తోండగా.. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘డంకీ’ మూవీ ప్రధానంగా.. ఇల్లీగల్‌గా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్), కెనడా వంటి అగ్ర దేశాలకు సరైన అనుమతులు, ధ్రువ పత్రాలు లేకుండా వెళ్లాలనుకునేవారు ఎలాంటి కష్టాలని ఎదుర్కొన్నారు? అనే కథాంశం నేపథ్యంలో రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన డంకీ డ్రాప్ 1, డ్రాప్ 2 మరియు డ్రాప్ 3లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాగా ఫన్, డ్రామా, రొమాన్స్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ‘డంకీ’ మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ అందించారు. మంగళవారం (డిసెంబర్ 05, 2023) ‘డంకీ’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేపు ట్రైలర్ రిలీజ్ చేస్స్తున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు.
#DunkiTrailer will be out tomorrow… #SRK & #RajkumarHirani are all set to unveil #DunkiDrop4 on December 5th.
Worldwide grand release on December 21, 2023. pic.twitter.com/GZx4K2wfQo
— Vamsi Kaka (@vamsikaka) December 4, 2023
కాగా ముందుగా అందించిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా ట్రైలర్‌ను మొదట డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే రెండు రోజులు ముందుగానే డిసెంబర్ 05న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా డిసెంబర్ 22న ‘డంకీ’ విడుదలవుతోండగా.. అదేరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండటం గమనార్హం. దీంతో రెండు పెద్ద సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























