కోలీవుడ్ ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరియు మరో నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన ‘జిగర్ తండ’ సినిమాకి సీక్వెల్గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. పాన్ ఇండియా లెవెల్లో నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు అయింది. వచ్చే శుక్రవారం (డిసెంబర్ 8, 2023) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా అతి త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: