యానిమల్ పై హీరో విశ్వక్ సేన్ సెన్సేషనల్ రివ్యూ

Hero Vishwak Sen Gives Sensational Review on Animal Movie

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‍లో రూపొందిన లేటెస్ట్ క్రేజీ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే త్రిప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదల చేసిన ‘యానిమల్’ టీజర్, ట్రైలర్ తో మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 1, 2023)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి మరోసారి తన డైరెక్షన్ పవర్ చూపించాడని, రణబీర్ కపూర్ నటన అయితే స్కై లెవెల్ అని సినీ ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘యానిమల్’పై సెన్సేషనల్ రివ్యూ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా దీనిపై వేదికగా స్పందిస్తూ.. “‘ యానిమల్ ఎక్కువ రన్‌టైమ్ కలిగి ఉన్నా.. అంతసేపూ ప్రేక్షకులను గ్రిప్పింగ్ చేసింది. సందీప్ రెడ్డి వంగా భారతీయ సినిమాకి మరో ఫెదర్ ను జోడించాడు. ఇక రణబీర్ కపూర్ నటన అయితే, ప్రేక్షకులకు నోట మాట రాకుండా మూగబోయేలా చేసింది. యానిమల్ తన ఫైర్ ఏంటో చూపించింది” అని పేర్కొన్నారు. కాగా విశ్వక్ సేన్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =