రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ – మహేష్ బాబు

Mahesh Babu Comments On Ranbir Kapoor

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ‘యానిమల్’ నుంచి ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ఇక ‘యానిమల్’లో ర‌ణ్‌బీర్ క‌పూర్కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రీ రీలిజ్ ఈవెంట్‌లా లేదు. 100 రోజుల వేడుకలా వుంది. ‘యానిమల్‌’ సినిమాపై ప్రేక్షకులు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ట్రైలర్‌ చూశా.. మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేను ఇప్పటివరకూ చూడలేదు. నేను ఎప్పుడూ ఇలా చెప్పను. మనస్పూర్తిగా ఫీలైతేనే చెబుతాను. సందీప్‌ ఫోన్‌ చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే నాకు ఇష్టం. తను చాలా యునిక్, ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ట్రైలర్‌లోని అనిల్‌ కపూర్‌ గారి నటన చూసిగూస్ బంప్స్ వచ్చాయి. బాబీ దేవోల్‌ యాక్టింగ్ స్టన్నింగ్‌గా వుంది. రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. ట్రైలర్‌లో అద్భుతంగా వుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. రణ్‌బీర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పా గానీ ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే ఈ వేదికపై మరోసారి చెబుతున్నా, నేను తన అభిమానిని. రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ అని నా అభిప్రాయం. యానిమల్ ఇప్పటివరకూ తన బెస్ట్ వర్క్ అని నా భావన. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిసెంబర్ 1న యానిమల్ విడుదలౌతుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని విన్నా. తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని మహేష్ బాబు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =