నిర్మాణ రంగంలోకి లోకేష్ కనగరాజ్- సొంత బ్యానర్ షురూ

lokesh kanagaraj launch new production house

ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు.
కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా చేరిపోయాడు. లోకేష్ కూడా సొంత బ్యానర్ ను స్టార్ట్ చేశాడు. ఈవిషయాన్ని లోకేష్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. నేను 5 చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత, కొత్త నిర్మాణ సంస్థ ‘జి స్క్వాడ్’ ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా, నా స్నేహితులు, సహాయ దర్శకుల చిత్రాలను ముందుగా నిర్మిస్తాను. ఆ చిత్రాలను చూసి మీరు ఆనందించాలని, మీ ప్రేమ, మద్దతు ఎప్పటిలానే నాపై ఉండాలని కోరుకుంటున్నా. ఈ బ్యానర్‌లో వ‌చ్చే తొలి ప్రాజెక్టు అప్‌డేట్స్‌ కోసం కొంతకాలం వేచి చూడండి అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =