ప్రముఖ నటుడు నరేష్ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా తన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. నరేష్‌కు టర్కీ, అనేక ఇతర దేశాలతో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సేవ అందించడంలో భాగంగా ఆయన టర్కీ, ఇతర దేశాలలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ , UNO ముఖ్యమైన విభాగం నాటో తో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అనేక ఇతర దేశాలతో ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలోని లక్సెంట్ హోటల్‌లోని ఆటం హాల్‌లో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది.
ఈ సమావేశానికి ఎన్.ఏ.ఎస్.డీ.పీ సెక్రటరీ జనరల్ ఏ.ఎమ్.బీ జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ అధ్యక్షత వహించారు. ఫిలిప్పీన్స్ దేశ పాలసీ అడ్వైజర్ చీఫ్ మిస్ క్లారిటా ఆర్ కార్లోస్, ఆరోగ్యమంత్రి, నేవీ, ఎయిర్ వింగ్ ,గ్రౌండ్ ఫోర్స్‌కు చెందిన 12 మంది మిలిటరీ జనరల్స్, అనేక మంది బ్రిగేడ్ జనరల్స్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కల్నల్‌లు, దేశాల డిప్యూటీ మంత్రులు, దౌత్యవేత్తలు, థాయ్‌లాండ్, ఇతర దేశాల నుంచి ప్రతినిధులు, ఇండియా నుంచి డాక్టర్ నరేష్ విజయకృష్ణ సన్మానాలు స్వీకరించేందుకు హాజరయ్యారు.
పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై డాక్టర్ నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి. డాక్టర్ నరేష్ విజయకృష్ణకు నైట్ హుడ్, అత్యున్నత బిరుదు ‘సర్’ ను ప్రదానం చేశారు. మిలిటరీ ఆర్ట్స్, హ్యూమన్ సర్వీస్‌లో గౌరవ డాక్టరేట్, పిహెచ్‌డితో సత్కరించారు. ఆర్బిట్రేషన్ & శాంతి మధ్యవర్తిత్వానికి సహచరుడిగా గుర్తించారు. పౌర హక్కుల సంరక్షకుడు బిరుదుతో గౌరవించారు.
అంతర్జాతీయంగా పూర్తి దౌత్య నిరోధక శక్తితో NASDP ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్‌లో మిలిటరీ ఆర్ట్స్ గుడ్ విల్ అంబాసిడర్, లెఫ్టినెంట్ కల్నల్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియన్ కమాండ్‌గా డాక్టర్ నరేష్ విజయకృష్ణ నియమించబడ్డాడు.
డాక్టర్ నరేష్ తన స్వాగత ప్రసంగంలో.. ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలతో పాటు ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడం, అరికట్టడంలో మీడియాకు గొప్ప బాధ్యత వుందని చెప్పారు. ఈ కాంపెయిన్ ని సెలబ్రిటీ, దౌత్యవేత్తగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిని జాతీయ క్యాడెట్ కార్ప్స్ (భారతదేశంలోని సాయుధ దళాల విద్యార్థి విభాగాలు), ఇతర దేశాలలో దేశం పట్ల బాధ్యత భావాన్ని తీసుకురావడానికి నియమించాలని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: