రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సెన్సేషన్ తో వచ్చేస్తున్నాడు. రణ్ బీర్ తో యానిమల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 1వతేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “అమ్మాయి”, “నే వేరే “, ‘నాన్న నువ్వు నా ప్రాణం’ పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట హీరో రోల్ కి సంబధించిన జర్నీ ని ఒక ఇంటెన్స్ గ్లింప్స్ గా చూపించారు. భూపిందర్ బబ్బల్ కమాండింగ్ వాయిస్ ,లిరిక్స్ మనన్ భరద్వాజ్ అద్భుతమైన కంపోజిషన్ తో.. వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్ పాత్ర జర్నీలో ఈ ట్రాక్ చాలా కీలకంగా వుంది. ఈ ట్రాక్ యానిమల్ సారాంశాన్ని తెలియజేస్తోంది. అం తేకాదు ఈ లేటెస్ట్ ట్రాక్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది.
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: