గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్‌.. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్

Mahesh Babu's Dum Masala Song From Guntur Kaaram Creates All Time Record

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. ఈ నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘గుంటూరు కారం’ ఫస్ట్‌ సింగిల్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 19.2 మిలియన్ల వ్యూస్ పైగా సాధించి రికార్డ్ సృష్టించింది. తద్వారా ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ‘ధమ్‌ మసాలా’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్‌ హెగ్డే, జ్యోతి నూరన్‌ ఆలపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.