బిగ్ బాస్ 7- ఎమోషన్స్ తో నిండిపోయిన హౌస్

bigg boss season 7 telugu house filled with emotions

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈషో లో 9వ వారం పూర్తయిపోయి 10 వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక నిన్న హీటెట్ ఆర్గ్యుమెంట్స్ తో నామినేషన్ ప్రిక్రియ జరగగా ఫైనల్ గా ప్రిన్స్, గౌతమ్, శివాజీ, భోలే, రతిక నామినేషన్స్ లోకి వచ్చారు. నామినేషన్ ప్రిక్రియతో సోమవారం ఎపిసోడ్ ముగియగా.. నిన్న రాత్రి ఎమోషన్స్ తో నిండిపోయింది హౌస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అప్పుడే బిగ్ బాస్ 7లో ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఫ్యామిలీ వీక్ అవ్వడంతో రెగ్యులర్ గా ఉండే టాస్క్ లు కాకుండా కాస్త భిన్నంగా ఇచ్చాడు బిగ్ బాస్. బీబీ హౌస్ ను కాలేజ్ గా మార్చి.. అందులో కంటెస్టెంట్ లు అందరూ విద్యార్థులుగా ఉంటారని.. అయితే సమయానుసారంగా కొంతమంది టీచర్లుగా మారి పాఠాలు చెప్పాల్సి ఉంటుందని తెలియచేశాడు. ఇక బిగ్ బాస్ చెప్పిన ప్రకారం టాస్క్ లోకి దిగిపోయారు హౌస్ మేట్స్.

ఇక ఈసమయంలో శివాజీని మెడికల్ రూంలోకి పిలిచారు. అక్కడకు వచ్చిన డాక్టర్ శివాజీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. శివాజీ తిరిగి వచ్చేస్తుంటే అక్కడికి వచ్చిన డాక్టర్ నాన్న అంటాడు. ముందు కన్ఫ్యూజ్ అయిన శివాజీ అక్కడికి వచ్చింది తన కొడుకు అని తెలుసుకొని ఎమోషనల్ అవుతాడు. ఇంటిలోకి వచ్చిన శివాజీ పెద్ద కొడుకు కెన్నీ తండ్రికి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు.. ప్రశాంత్, యావర్ ని మినహాయించి ఇంటిలో ఎవరిని నమ్మొద్దని.. ఎవరిని రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని..వీకెండ్ లో నాగార్జునగారు ఇచ్చిన హింట్లను కూడా తీసుకోమని చెబుతాడు.

ఆతరువాత అర్జున్ భార్య సుజాత ఇంటిలోకి ఎంట్రీ ఇస్తుంది. భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో తనను చూసిన వెంటనే ఎమోషనల్ అవుతాడు అర్జున్. ఇక సురేఖ కూడా అర్జున్ కు ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేసింది. ఇంకా ఓపెన్ అవ్వాలని.. ఎమోషన్స్ దాచుకోవద్దని.. రియాక్ట్ అవ్వాల్సిన చోట రియాక్ట్ అవ్వాలని చెప్పింది. ఇక సురేఖ ప్రెగ్నెంట్ కావడంతో హౌస్ లోనే సీమంతం చేసే ఏర్పాటు చేశాడు.

అనంతరం అశ్విని వాళ్ల మథర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అశ్విని తో పాటు తల్లి కూడా ఏడ్చేసింది. నేను నీతో వచ్చేస్తాను అంటూ అశ్విని అంటుంది. దానికి వాళ్ల అమ్మగారు థైర్యం చెప్పారు. ధైర్యంగా పోరాడాలని చెప్పింది. అంతేకాదు నువ్వు నా అని ఎవరిని అనుకుంటావో వాళ్లు నీ వాళ్లు కాదని.. పెద్దవాళ్లతో ఉండమని చెప్పింది. అలా ముగ్గురి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ తో నిన్న ఎపిసోడ్ ముగిసింది. ఇక నేడు మరో ముగ్గురి కంటెంస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ రానున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.