బిగ్ బాస్ 7- రతిక, అమర్ బిగ్ ఫైట్

bigg boss season 7 big fight between amardeep and rathika rose

బిగా బాస్ 7లో 9వ వారం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ ను రెండు గ్రూపులుగా చేసి ఒక గ్రూపుకు వీర సింహాలు, గర్జించే పులులు అంటూ పేర్లు పెట్టాడు. ఇక వీరసింహాలు టీమ్ లో యావర్, గౌతమ్, భోలే, రతిక, తేజ, శోభా శెట్టి.. గర్జించే పులుల టీమ్ లో శివాజీ, అమర్, అర్జున్, ప్రియాంక, అశ్విని, ప్రశాంత్ ఉన్నారు. ఇక మొదట జంపింగ్ జపాంగ్ అనే ఆటను పెట్టగా అందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వేరే టీమ్ నుండి ఒక మెంబర్ ను గేమ్ నుండి తీసేసే ఛాన్స్ కొట్టేశారు. దీంతో ప్రశాంత్ ను గేమ్ నుండి తొలగించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తరువాత బాల్స్ గేమ్ పెట్టాడు. ఎవరు ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వారు గెలిచినట్టు. అయితే ఈ గేమ్ లో కొన్ని పవర్ బాల్స్ కూడా వస్తాయి. ఇక ఈ గేమ్ లో అమర్ దీప్ ఇంకా రతిక మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అనంతరం బిగ్ బాస్ బ్రేక్ ఫాస్ట్ ఎయిమ్ అనే టాస్క్ ను ఇచ్చాడు. ఈ గేమ్ లో ఇరు టీమ్ ల నుండి ఇద్దరు సభ్యులు వచ్చి ఆడాల్సి ఉంటుంది. వీరసింహాలు టీమ్ నుండి శోభా, గౌతమ్ ఆడగా.. గర్జించే పులులు టీమ్ నుండి అర్జున్, అమర్ ఇద్దరూ వచ్చి ఆడారు. ఈగేమ్ లో అమర్, అర్జున్ గెలుపొందారు. దీంతో శివాజీ టీమ్ కు బిగ్ బాస్ రెండు ఆప్షన్స్ ఇస్తాడు. ఒకరిని ఆటలో నుండి తప్పించడం.. ఇంకోటి 500 బాల్స్ తీసుకోవడం. వీటిలో శివాజీ టీమ్ 500 బాల్స్ ను తీసుకునే ఆప్షన్ ను ఎంచుకుంటుంది.

ఇక బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంటాడు కదా.. అలా మరో ట్విస్ట్ ఇచ్చాడు. బాల్స్ గేమ్ లో ఎవరికైతే గోల్డెన్ బాల్ దొరుకుతుందో వారికి స్పెషల్ పవర్ ఉంటుందని తెలుపుతాడు. ఆబాల్ గౌతమ్ టీమ్ కు దొరకుతుంది. ఈక్రమంలో బిగ్ బాస్ స్వాపింగ్ ఆప్షన్ ఇస్తాడు. గౌతమ్ లో ఉన్న వీక్ పర్సన్ ను వేరే టీమ్ మెంబర్ తో స్వాప్ చేసే అవకాశం ఇస్తాడు. దాంతో గౌతమ్ టీమ్ చర్చించుకొని భోలే ను అర్జున్ తో స్వాప్ చేస్తారు.

ఇక నైట్ అవ్వడంతో హౌస్ మేట్స్ బాల్స్ దొంగతనానికి ట్రై చేస్తుంటారు గౌతమ్ టీమ్. అయితే శివాజీ అలా ఆడకూడదు అంటూ ఫైర్ అవుతుంటాడు. ఈ విషయంలో గౌతమ్ ఇంకా శివాజీ మధ్య చిన్నపాటి వివాదమే జరుగుతుంది. ఉదయాన్నే మళ్లీ గేమ్ మొదలుపెడతాడు బిగ్ బాస్. మరి ఫైనల్ గా ఏ టీమ్ గెలిచింది.. ఏ టీమ్ కెప్టెన్సీ పోటీలో నిలుస్తుంది.. ఎవరు కెప్టెన్ అవుతారు లాంటి విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =