బిగ్ బాస్ 7 – బీబీ మారథాన్-తేజ, శోభా గొడవ

bigg boss season 7 telugu big fight between teja and shobha

బిగ్ బాస్ 7 లో ఏడు వారాలు పూర్తయి ఎనిమిదో వారం మొదలైపోయింది. ఇక ఈవారం నామినేషన్స్ కూడా ఫుల్ ఫైర్ తో ముగిశాయి. మొత్తం 8మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ప్రియాంక, శోభ, సందీప్, అమర్ దీప్, భోలే, శివాజీ, గౌతమ్, అశ్విని నామినేట్ అయ్యారు. ఇక ఉదయం లేచిన తరువాత శివాజీ నామినేషన్ ప్రక్రియ అనేది తెలివైన ప్రక్రియ.. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం తమ హీరోయిజాన్ని చూపించుకుందామని ఎగిరిపడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా ఎప్పటిలాగే ఈవారం కెప్టెన్సీకి కూడా పలు గేమ్స్ తో వచ్చేశాడు బిగ్ బాస్. ఈవారం బీబీ మారథాన్ అనే కాన్సెప్ట్ తో వచ్చేశాడు. ఇందులో ఒక్కో టాస్క్ లో నలుగురు కంటెస్టెంట్ లు పోటీ పడాల్సి వస్తుంది.. ఆ టాస్క్ లో గెలిచిన వారు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు.. లాస్ట్ లో నిలిచిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారు. అలా ముందుగా రిజల్ట్ ఏంటో గెస్ చేయాలి అంతే అనే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. ఈటాస్క్ లో నీటిలో కొన్ని వస్తువులు వేయగా అవి తేలుతాయో?మునుగుతాయో అని చెప్పాలి. ఇక ఈటాస్క్ లో ప్రియాంక, శోభ, అమర్ దీప్, తేజ పాల్గొనగా ప్రియాంక ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది.

ఇక రెండో టాస్క్ గా డబ్బాలు సెట్ చేయాలంతే? అనే గేమ్ ను పెట్టగా ఈ గేమ్ లో ప్రశాంత్, యావర్, గౌతమ్, రతిక పాల్గొనగా ఈగేమ్ లో ప్రశాంత్ గెలవగా, ఆతర్వాత యావర్, గౌతమ్ 2,3స్థానాలను దక్కించుకన్నారు. రతిక ఎలిమినేట్ అవుతుంది. ఈగేమ్ జరుగుతున్నప్పుడు తేజ ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్న తిననని బిగ్ బాస్ కు చెప్పు అన్నాడు. దీంతో శోభా తేజపై కోప్పడుతుంది. ఇక్కడ ఇద్దరికీ పెద్ద గొడవనే అవుతుంది. వీరి గొడవతో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి నేడు ఎలాంటి గేమ్స్ ఇస్తాడో.. ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =