సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టేసి తన వీడియోలతో అలరించింది. ఇక ఆ తరువాత ఇన్ట్సాలో కూడా జాయిన్ అయి తన అకౌంట్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలు పంచుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్య ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది. ఇలా చిన్న వయసులోనే సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు వరల్డ్ సినిమా డే సందర్భంగా సితార తన ఇన్ట్సా ద్వారా సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమను అభిమానాన్ని తెలియచేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సినిమా అనే దానకి నా లైఫ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సినిమా అనేది ఇండస్ట్రీ కాదు నా డీఎన్ఏలో ఒక భాగం.. మా నాన్న వాళ్ల నాన్న ఎలాగో నాకు మానాన్న స్పూర్తిదాయకం.. మా తాతగారు లెజెండరీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణగా మన అందరిపై ఎంతో ప్రభావం చూపించారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా బ్రదర్.. నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం సితార పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: