కాలినడకన తిరుమలకు, లియో డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌.. వీడియో వైర‌ల్

Leo Director Lokesh Kanagaraj and Writer Rathna Kumar Visits Tirumala, Video Gone Viral

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘లియో’. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజ‌య్‌ ద‌త్ మరియు బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ‘లియో’ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అవగా.. ప్రస్తుతం డబ్బింగ్‌ మరియు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబ‌ర్ 19న ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ‘లియో’ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ‘లియో’ మూవీ టీమ్ తాజాగా తిరుమల పర్యటనకు వచ్చింది. ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్‌, డైలాగ్ రైట‌ర్ ర‌త్న కుమార్ మరియు ఇతర యూనిట్ సభ్యులు గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వీరంతా తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో ఉద‌యం తిరుమ‌ల‌కు రాగా.. టీటీడీ సిబ్బంది లియో టీమ్‌కు ప్రోటెక్ష‌న్ కల్పించింది. కాగా వీరు ఈ మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక ఈ సందర్భంగా.. ‘లియో’ టీమ్‌ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ‘లియో’ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో బ్యాక్ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్‌. దీనిలో భాగంగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే విడుదల చేసిన హీరో విజయ్, సంజయ్ దత్, త్రిష లుక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ‘ప్రేమ ఓ ఆయుధం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + fifteen =