బిగ్ బాస్7- రైతు బిడ్డ కెప్టెన్సీ పీకేసిన బిగ్ బాస్

bigg boss season 7 telugu day 38 highlights

బిగ్ బాస్ 7 మొన్న ఎపిసోడ్ లో నామినేషన్స్ పూర్తయిపోయి సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ఎంట్రీ ఇవ్వడం.. తనకు ఇచ్చిన పవర్ తో సందీప్ ను నామినేషన్ నుండి తప్పించడం జరుగుతుంది. దీంతో ఈవారం అమర్ దీప్, ప్రిన్స్, సందీప్, తేజ, శోభాశెట్టి, నయని పావని, అశ్విని, పూజా నామినేషన్స్ లోకి వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు అంటూ కొత్తవాళ్లను పోటుగాళ్లు టీమ్ గా పాతవాళ్లను ఆటగాళ్లుగా డివైడ్ చేశారు. అయితే సీక్రెట్ రూమ్ నుండి వచ్చిన గౌతమ్ ను కొత్తవాళ్ల టీమ్ లోనే వేస్తాడు బిగ్ బాస్. ఇక హూ ఈజ్ ద బెస్ట్ అనే టాస్క్ పెట్టి ఇందులో గెలిచిన వారు కెప్టెన్సీ కంటెడర్లు అవుతారని తెలిపాడు. ఈనేపథ్యంలో ముందుగా హూ ఈజ్ ఫిట్టెస్ట్ అనే గేమ్ పెట్టగా అందులో పోటుగాళ్లు టీమ్ నుండి అర్జున్-గౌతమ్ పాల్గొనగా ఆటగాళ్లు టీమ్ నుండి సందీప్-ప్రిన్స్ పాల్గొన్నారు. ఈగేమ్ లో అర్జున్-గౌతమ్ గెలిచారు. ఆ తరువాత హూ ఈజ్ జీనియన్ అనే గేమ్ పెట్టగా ఆటగాళ్లు టీమ్ నుండి అమర్ దీప్, పోటుగాళ్లు టీమ్ నుండి గౌతమ్ వెళ్లగా.. సరిగ్గా ఆడటంలేదని అమర్ దీప్ వెనక్కి వచ్చేస్తాడు. తన ప్లేస్ లో తేజ వెళతాడు. ఈ గేమ్ లో కూడా పోటుగాళ్ల టీమే గెలుస్తుంది. ఈ గేమ్ తరువాత అమర్ దీప్ డిజప్పాయింట్ అవుతాడు.

ఇక నిన్న ఎపిసోడ్ ప్రారంభంలోనే రైతుబిడ్డకు షాకిచ్చాడు బిగ్ బాస్. అసలు కెప్టెన్ అంటే ఎంటి అని హౌస్ మేట్స్ ను అడుగగా..ఎవరికి తోచింది వాళ్లు చెప్పారు. ఆ తరువాత ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని అడగగా దానికి సందీప్, తేజ, శోభా తప్పా అందరూ చేతులెత్తారు. ఇక కెప్టెన్సీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడంలేదని తెలుపుతూ ప్రశాంత్ కెప్టెన్సీ రద్దు చేశాడు. దీంతో ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు.

మరోవైపు కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతుండగా ఇప్పటికే రెండు గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. నిన్న మరో రెండు గేమ్లు పెట్టాడు. ముందుగా హూ ఈజ్ ఫాస్టెస్ట్ అనే గేమ్ పెట్టాడు. ఈ గేమ్ బిగ్ బాస్ ఏ రంగు అయితే చెబుతాడో ఆ రంగు వస్తువును తీసుకొచ్చి లాన్ మార్క్ దగ్గర పెట్టాలి. ఇక ఈ ఆటలో ఆశ్విని, అమర్ దీప్ పాల్గొనగా.. ఆటగాళ్ల టీమ్ గెలుస్తుంది. ఆ తరువాత హూ ఈజ్ స్ట్రాంగెస్ట్ అనే గేమ్ ను పెట్టగా ఆగేమ్ లో ఆటగాళ్ల టీమ్ నుండి ప్రిన్స్, పోటుగాళ్ల టీమ్ నుండి అర్జున్ పాల్గొంటారు. ఈగేమ్ లో అర్జున్ గెలుస్తాడు. అలా పెట్టిన నాలుగు గేమ్స్ లో మూడు టాస్కుల్లో పోటుగాళ్ల టీమ్ విన్ అవ్వడంతో కెప్టెన్సీ కంటెడర్లు అవుతారు. మరి వీరికి బిగ్ బాస్ ఎలాంటి గేమ్ ను పెడతాడో చూడాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =