మాస్టర్ తరువాత విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లియో.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ రికార్డులను తిరగరాసింది.అతి తక్కువ సమయంలో 1మిలియన్ లైక్స్ ను రాబట్టిన మొదటి ఇండియన్ సినిమా ట్రైలర్ గా లియో రికార్డు సృష్టించింది.అంతేకాదు సౌత్ లో 24గంటల్లో 31మిలియన్ల వ్యూస్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఇక తెలుగు వెర్షన్ ట్రైలర్ కు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు 6మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.ఇదిలావుంటే కొద్దిసేపటి క్రితం ఈసినిమా తెలుగు వెర్షన్ నుండి బ్యాడాస్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోను ఎలివేట్ చేస్తూ సాగే సాంగ్ ఇది.అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కి తోడు లిరిక్స్ కూడా క్యాచీ గా వున్నాయి.ఈసినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదలచేస్తుంది.దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది.కోలీవుడ్ లో లియో కి పెద్దగా పోటీ లేదుకానీ తెలుగులో మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.దసరా సీజన్ లో బాలకృష్ణ, భగవంత్ కేసరి రవితేజ, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు విడుదలకానున్నాయి.మరి లియో ఈరెండు సినిమాలను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లియోలో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్,అర్జున్ సర్జ, గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ ఫై లలిత్ కుమార్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: