మ్యాడ్ సినిమాకు హిట్ టాక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

MAD Movie Box Office Collection Gross Over 1.8 Cr on Day 1

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవగా.. ‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో కామెడీ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయింది. లాజిక్స్ జోలికి వెళ్లకుండా కమర్షియల్ పంథాలో తెరకెక్కించిన ఈ సినిమా పక్కా పైసా వసూల్ మూవీ అని ఆడియెన్స్ అంటున్నారు. దీంతో ప్రతి షోకి వసూళ్ళను పెంచుకుంటూ పోతోంది. తాజా సమాచారం ప్రకారం.. మ్యాడ్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. 1.8 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే నంబర్ చూస్తే తక్కువగానే అనిపిస్తున్నా.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే..? ఈ చిత్రంలో నటించిన వారందరూ కొత్తవారే. ఒకరిద్దరు మినహాయిస్తే.. సినిమాలో కనిపించిన నటీనటులందరూ కొత్తవారే కావడం గమనార్హం. అయినా కంటెంట్ బావుండటంతో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కాగా చిత్రం విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘జాతిరత్నాలు’ కన్నా ఎక్కువే నవ్విస్తుంది అని, లేదంటే డబ్బులు వాపస్ చేస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేశారంటే.. మొదట అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సినిమా చూసినవారందరూ ఇది నిజమే అనేలా ఈ మధ్యకాలంలో వచ్చిన ఫుల్ ఎంటర్‌టైనర్ ఇదే అని కితాబిస్తున్నారు. సో.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =