స్టార్ హీరోలపై శివ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

shiva rajkumar interesting comments on mahesh babu and jr ntr

కన్నడ సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే అక్కడ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమారర్ తన కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. దానికితోడు శివ రాజ్ కుమార్ కు కన్నడ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ వేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివరాజ్ కుమార్ హీరోగా వస్తున్న సినిమా ఘోస్ట్. ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. అక్టోబర్ 19వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా శివ రాజ్ కుమార్ ట్విట్టర్ లో సెషన్ నిర్వహించాడు. ఈ సెషన్ లో శివ రాజ్ కుమార్ ను నెటిజన్లు పలు ఆసక్తికర విషయాలు అడిగారు.

ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ కు మన తెలుగు స్టార్ హీరోల గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈనేపథ్యంలో మహేష్ తో శివరాజ్ కుమార్ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ ఫొటో గుర్తుందా అని అడుగగా.. ఆయన గురించి మాటల్లో చెప్పలేం.. ఎంతో డిగ్నిఫైడ్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటారు.. మాట్లాడేది తక్కువే అయినా.. అద్భుతంగా నటిస్తాడు అని మహేష్ గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఎన్టీఆర్ గురించి.. తారక్ అన్న కన్నడలో మాట్లాడుతుంటే మీకెలా ఉంటుంది.. మా కన్నడ ఫ్యాన్స్ గురించి చెప్పండి అని అడిగగా దానికి కన్నడలో మాట్లాడాలంటే చాలా పెద్ద మనసు, విశాల హృదయం కావాలి.. అది తారక్‌కు ఉంది.. ఆయన కన్నడలో మాట్లాడటమే కాదు పాట కూడా పాడారు.. మా ఫ్యామిలీ అంతా తారక్‌ను ప్రేమిస్తుంటుంది.. తారక్ ఫ్యాన్స్ అంటే నాకూ ఇష్టమే అని తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ పిక్ ను తానే పోస్ట్ చేసి పవన్ మీదున్న ప్రేమను తెలియచేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + sixteen =