బేబీ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత ఎస్‌కెఎన్

Baby Producer SKN Gifts Benz Car To Director Sai Rajesh

టాలీవుడ్‌లో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘బేబి’. క్యూట్ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి యువతరం ఫిదా అయింది. దీంతో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌ పెద్ద సినిమాల స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.95కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘బేబి’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేశ్‍ను పలువురు ప్రముఖులు అభినందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘బేబి’ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలిరోజే సెన్సేషనల్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. దీంతో బేబి మూవీ యూనిట్ కల్ట్ బ్లాక్‍బాస్టర్ పేరుతో గ్రాండ్‌గా సంబరాలు కూడా నిర్వహించింది. అనంతరం బేబి మూవీ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టి.. ఓటీటీ రికార్డులను కూడా బద్దలుకొట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్‍లోనూ భారీ ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ‘బేబీ’ మూవీ సూపర్ సక్సెస్ కావడానికి కారణమైన దర్శకుడు సాయి రాజేశ్‍కు ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ (ఎస్‌కెఎన్) స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. న్యూ బ్రాండ్ లగ్జరీ బెంజ్ కారును బహుమతిగా అందించారు.

కాగా ఇది మెర్సెడెస్ బెంజ్ ఏ200 మోడల్ కారు అని, ఎక్స్-షోరూమ్ లో దీని ధర సుమారు రూ.45.80 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ వైట్ కలర్ వేరియంట్‍ను సాయి రాజేశ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కారు కీని ఎస్‍కేఎన్ రాజేశ్‍కు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ‘బేబీ’ సినిమా రిలీజ్‌కు ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్‌తో నిర్మాత ఎస్‌కెఎన్ డైరెక్టర్ సాయి రాజేశ్‌కు ఒక కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు ‘బేబీ’ సక్సెస్ సంతోషంలో మరోసారి బెంజ్ కారును బహుమతిగా అందించారు. కాగా ఇదేవిధంగా ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత వీరికి కాస్ట్లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =