మొత్తానికి బ్రేక్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. గత కొంతకాలం మయోసైటిస్ తో బాధపడిన సమంత ఆ తరువాత కోలుకొని తన సినిమాల షూటింగ్ లను అలానే వెబ్ సిరీస్ ను పూర్తి చేసేసింది. అయితే మళ్లీ పూర్తిగా కోలుకోవడానికి ఏడాదిపాటు షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే బ్రేక్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ముందు బాలి వెళ్లి అక్కడ కొన్ని ప్రదేశాలను చుట్టేసింది. ఇప్పుడు ఆస్ట్రియా టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సైక్లింగ్ చేస్తూ సంతోషంగా గడిపింది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతంచేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఇంకా సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా రీసెంట్ గా పూర్తి చేసుకుంది సమంత.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: