జాతిరత్నాలు తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.ఈనెల 7న విడుదలై పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుంది.విడుదలైన మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టగా ఆతరువాత మౌత్ టాక్ ప్రభావంతో కలెక్షన్స్ జోరు అందుకున్నాయి.దాంతో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది.అటు ఓవర్సీస్ లో అయితే డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఏకంగా 2మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెట్ ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా వచ్చే నెల 5నుండి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తెలుగుతోపాటు మలయాళ,కన్నడ,తమిళ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈసినిమాలో అనుష్క హీరోయిన్ గా చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఆమె తెర మీద కనిపించింది.మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మురళీ శర్మ,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించగా రధన్ సంగీతం అందించాడు.యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
ఇక ఈసినిమా హీరో,హీరోయిన్ కి హ్యాట్రిక్ అందించింది.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ,జాతి రత్నాలుతో నవీన్ వరుస హిట్లను ఖాతాలో వేసుకోగా ఇప్పుడు మిస్ శెట్టి తో హ్యాట్రిక్ కొట్టాడు.అలాగే అనుష్క యూవీలోఇంతకుముందు మిర్చి,భాగమతి సినిమాల్లో నటించగా తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఆ బ్యానర్ లో హ్యాట్రిక్ కొట్టింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























