కన్నప్ప నుంచి కీలక అప్‌డేట్.. మంచు విష్ణుతో స్టార్‌ హీరో

Mohanlal Likely To Play Key Role in Manchu Vishnu's Kannappa

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా గత కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘కన్నప్ప’ న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వెల్లడయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భాగమయ్యారు. ఈ మేరకు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. కన్నప్ప చిత్రంలో మోహన్‍లాల్ నటించనున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఒక ట్వీట్‌కు తనదైన శైలిలో ‘హర హర మహాదేవ్’ అంటూ రిప్లై ఇచ్చారు మంచు విష్ణు. ఈ సందర్భంగా విష్ణు, మోహన్ లాల్ ని కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో కన్నప్ప చిత్రంలో మోహన్‍లాల్ నటిస్తున్నారన్న వార్తలకు బలం చేకూరినట్లయింది.

కాగా ఇంతకుముందు కూడా ఇలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అప్పుడు దీనిపై స్పందించిన విష్ణు ‘హరహర మహాదేవ్‌’ అంటూ ఇప్పటిలాగే పోస్ట్‌ చేయడంతో ఈ వార్తలు నిజమే అని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇక మహాశివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా నయనతార నటించనున్నారని అంటున్నారు. వీరికి తోడు ఇప్పుడు తాజాగా మోహన్‍లాల్ కూడా తోడవటంతో ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇటీవలే హీరోయిన్ నుపుర్ సనన్‍ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో కన్నప్ప టీమ్ మరో హీరోయిన్ వేటలో ఉంది.

ఇక ‘కన్నప్ప’ చిత్రాన్ని ‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మించనున్నారు. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =