ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. వచ్చే ఏడాది పొంగల్ బరిలో ఈసినిమా దిగనుంది. 2024 జనవరి 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఈసినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా జనవరి 12, 2024 న వస్తుందంటూ ట్వీట్ చేశాడు. దీంతో రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదన్న క్లారిటీ వచ్చేసింది.
#HanuMan 12 JAN 2024 💪🏽 pic.twitter.com/GW0Rd1TYjI
— Prasanth Varma (@PrasanthVarma) September 29, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: