అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ప్రీ టీజర్ ను అలానే వరుసగా పోస్టర్లను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ ఏంటో అనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టి కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే టీజర్ బట్టి తండ్రీ-కొడుకల ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఈసారి కూడా సందీప్ టిపికల్ స్టోరీతో వస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ఈసినిమా ఏ రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుందో.. ఇక తాజాగా ఈసినిమా టీజర్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించి ప్రశంసలు కురిపించాడు. స్టన్నింగ్ టీజర్.. రణబీర్, సందీప్,భూషణ్ జీ కంగ్రాట్స్ .. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
కాగా ప్రభాస్ సందీప్ వంగాతో స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాప్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే సినిమానే అయినా సందీప్ తన మార్క్ మేకింగ్ ను చూపిస్తాడని అంటున్నారు. ఇక ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: