సెకండ్ ఇన్నింగ్స్ తరువాత బిజీ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది జగపతిబాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ హీరో అనిపించుకున్న జగపతిబాబు ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లోనే కాదు పలు భాషల్లో సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే జగపతిబాబు ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనలను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో జగపతిబాబు కూాడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందేకదా. ఇక తాజాాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ఈసినిమాలోని తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.
తన కెరీర్ లోని బెస్ట్ క్యారెక్టర్స్ లో సలార్ లోని రాజమన్నార్ రోల్ ఒకటని.. ఆ రోల్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా రాసుకున్నారని, ఆ పాత్ర స్క్రీన్ పై ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని నటుడిగా తనకు మరింత మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉందని… ముందు ముందు ఇటువంటి మరిన్ని విభిన్నమైన రోల్స్ తో ఆడియన్స్ ని మరింతగా అలరిస్తానని తెలిపారు.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఇక ఈసినిమా రిలీజ్ పై రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత తన సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. డిసెంబర్ లో ఈసినిమా రిలీజ్ ఉండబోతుందని అర్థమవుతుంది. మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: