2 మిలియన్ కు చేరువగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

Miss Shetty Mr Polishetty latest usa collections

ఈమధ్య కాలంలో చిన్నసినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుంది. స్టార్ హీయిన్ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఇక కొత్త కాన్సెప్ట్ లను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ఇప్పుడు ఈసినిమా మరోసారి నిరూపించింది. నిజానికి ఈసినిమా జవాన్ సినిమా ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అయితే జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈసినిమా పరిస్థితి ఏంటా అనుకున్నారు. కానీ ఈసినిమా మాత్రం చిన్నగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక అప్పటినుండీ సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. అంతేకాదు ఇప్పటికే 50కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా యూఎస్ లో మాత్రం ఇంకా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. రిలీజ్ అయిన దగ్గర నుండీ కూడా డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఈమధ్యే 1.6 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు 1.8 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ లోపు ఈసినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయం అంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.