నారప్పతో తన రూట్ మార్చుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.అప్పటివరకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ లను తీసిన అయన నారప్పతో యాక్షన్ జోనర్లోకి మారాడు.ఈసినిమా థియేటర్లో విడుదలకాలేదు కానీ ఓటిటి లో వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాతో శ్రీకాంత్ అడ్డాల యాక్షన్ సినిమాలను కూడా తీయగలను అని నిరూపించుకున్నాడు.ఇక ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ రూరల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పెదకాపు పార్ట్ 1 తీశాడు.ఈ సినిమాను కొత్త హీరో తో చేయడం విశేషం.ఈసినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది.సినిమా మీద నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందే హైదరాబాద్ లో పెయిడ్ షోస్ వేశారు.ఈషోస్ నుండి సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ తో మొదలు కొన్ని ప్రతి ఒక్క టెక్నిషయన్ డ్యూటీ చేశాడని అలాగే వీరితో పాటు నటీనటులు కూడా మెప్పించడంతో పెదకాపు పార్ట్ 1 షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ అనేటాక్ వచ్చింది.ఇక రేపే ఈసినిమా విడుదలకానుంది.
ఈసినిమాలో ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్ గా నటించగా రావు రమేష్, నాగ బాబు ,తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు.మిక్కి జె మేయర్ సంగీతం అందించగా అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























